Twitxy Saved

Anitha Vangalapudi

Verified account This account is verified. Learn more

@Anitha_TDP

Home Minister, Andhra Pradesh || Politburo Member, TDP || President, Telugu Mahila (AP) || MLA - Payakaraopeta | t.me/VangalapudiAni…
Joined August 2015
22 Following 106K Followers 127K Posts

Latest posts 5

Anitha Vangalapudi Verified account @Anitha_TDP
కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీ ఘటనపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాను. జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి, అగ్నిమాపక శాఖతో పాటు సంబంధిత అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించాను. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాము.
0 replies 1 reposts 18 likes 637 views View on X
Anitha Vangalapudi Verified account @Anitha_TDP
బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్టీజీఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించి, తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించాను.

రానున్న నాలుగు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదు. రైతులు పంటల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

గతంలో రెండు తుపాన్లను సమష్టి కృషితో సమర్థంగా ఎదుర్కొన్నాం. అదే సమన్వయంతో ఈ విపత్తును కూడా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యత. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రజలకు అండగా ఉంటాం.
2 replies 2 reposts 22 likes 1.2K views View on X
Anitha Vangalapudi Verified account @Anitha_TDP
ఈనాడు సంస్థల వ్యవస్థాపకులు స్వర్గీయ రామోజీరావు గారి జయంతిని పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన ‘రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల’ ప్రదానోత్సవంలో గౌరవనీయ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి, తమదైన ముద్ర వేసిన తొమ్మిది మంది ప్రతిభావంతులకు ప్రతిష్టాత్మక పురస్కారాలు ప్రదానం చేసిన ఈ వేడుకలో భాగస్వామిని కావడం సంతోషంగా ఉంది. రామోజీరావు గారి జీవిత ప్రయాణం, దార్శనికత, విలువలు భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.

#RamojiRaoExcellenceAwards #RamojiRao #Vijayawada #AndhraPradesh #ExcellenceAndInspiration
0 replies 2 reposts 59 likes 1.1K views View on X
Anitha Vangalapudi Verified account @Anitha_TDP
అమ్మవారి సన్నిధిలో మరోసారి ఆత్మీయమైన అనుభూతి. సహచర మంత్రులు సంధ్యారాణి, సవితమ్మతో కలిసి ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాను. ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని అమ్మవారిని కోరుకున్నాను.

#KanakaDurgaTemple #Indrakeeladri #Vijayawada #DivineBlessings #AndhraPradesh
1:21
2 replies 20 reposts 126 likes 2.2K views View on X
Anitha Vangalapudi Verified account @Anitha_TDP
ఇంద్రకీలాద్రి అంటే ఆధ్యాత్మిక అనుభూతి, అమ్మవారి సన్నిధి అంటే అంతులేని ఆత్మీయత. ఎప్పుడు వచ్చినా అదే భక్తిభావం, అదే దైవిక ప్రశాంతత. సహచర మంత్రులు సంధ్యారాణి, సవితమ్మతో కలిసి శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొనడం జరిగింది. అమ్మవారి కరుణాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నాను.

#Indrakeeladri #KanakaDurgaTemple #Vijayawada #DivineBlessings #AndhraPradesh