📅 తేది: 09.11.2026
🌾 విషయం: మెగా రైతు మేళా & ఇండస్ట్రియల్ ఎక్స్‌పో–2026 – గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి ప్రసంగం
📍 వేదిక: హకీంపేట్ గ్రామం, దుద్యాల మండలం, వికారాబాద్ జిల్లా.
🌾 వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట్ గ్రామంలో నవంబర్ 7 నుండి 9 వరకు మూడు రోజులపాటు నిర్వహించిన మెగా రైతు మేళా & ఇండస్ట్రియల్ ఎక్స్‌పో–2026 ముగింపు కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.
🌱 ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో పామాయిల్ సాగును ప్రోత్సహించడంతో పాటు పామాయిల్ సంబంధిత పరిశ్రమలను కూడా తీసుకువస్తామని, వేలాది ఎకరాల్లో సాగు విస్తరణకు, వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులకు కృషి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు.
🌾 ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో ఆహార ధాన్యాలకు ఎలాంటి కొరత లేదని, రాబోయే 12 నెలలకు సరిపడా బియ్యం నిల్వలు ప్రభుత్వ గోదాముల్లో ఉన్నాయని తెలిపారు. రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆరుతడి పంటలు పండిద్దాం – కరువును ఎదుర్కొందాం అని పిలుపునిచ్చారు.
📺 ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1,600కు పైగా రైతు వేదికల ద్వారా లక్షలాది మంది రైతులు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు.
🏛️ ఈ కార్యక్రమంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ మరియు వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ కె. సురేంద్ర మోహన్ గారు, ఐఏఎస్, వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బి. గోపి గారు, ఐఏఎస్ తదితరులు పాల్గొన్నారు.
🌾 వ్యవసాయ శాఖ, తెలంగాణ 🌾
@GopiB_IAS