Twitxy Saved

HMWSSB

Verified account This account is verified. Learn more

@HMWSSBOnline

This is the official Twitter account of Hyderabad Metropolitan Water Supply and Sewerage Board.

Customer care: 155313 ; 040-23300114.
Hyderabad, India hyderabadwater.gov.in Joined September 2016
121 Following 73K Followers 104K Posts

Latest posts 5

Pinned post

HMWSSB Verified account @HMWSSBOnline
గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ఫిల్లింగ్ స్టేషన్లను పరిశీలించిన జలమండలి జేఎండీ
===================
# దుర్గం చెరువు, ఖాజాగూడ ఎస్టీపీల్లో జేఎండీ మయాంక్ మిట్టల్ తనిఖీలు

# గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సరఫరా రికార్డులు, ఫ్లో మీటర్ల పరిశీలన

# శుద్ధి చేసిన నీటి సరఫరా పరిమాణాన్ని పెంచాలని అధికారులకు ఆదేశం

# డిజిటల్ బోర్డుల్లో నీటి నాణ్యతా ప్రమాణాల పరిశీలన

జలమండలి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్ సోమవారం దుర్గం చెరువు, ఖాజాగూడ మురుగునీటి శుద్ధి కేంద్రాలను (ఎస్టీపీలు) సందర్శించి, గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ఫిల్లింగ్ స్టేషన్ల నిర్వహణను పరిశీలించారు.

ఈ సందర్భంగా గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసిన నీటి పరిమాణం, ట్యాంకర్ల ట్రిప్పుల సంఖ్యకు సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఫిల్లింగ్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఫ్లో మీటర్ల పనితీరును పరిశీలించి, శుద్ధి చేసిన నీటి సరఫరా పరిమాణాన్ని మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు.

దుర్గం చెరువు ఎస్టీపీలో ఏర్పాటు చేసిన డిజిటల్ డిస్‌ప్లే బోర్డులో ప్రదర్శిస్తున్న శుద్ధి జలాల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్దేశిత ప్రమాణాలను పాటించాలని సూచించారు.

తాగునీటి సంరక్షణలో భాగంగా నిర్మాణాలు, గార్డెనింగ్, ఇతర తాగేతర అవసరాలకు గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని మరింత పెంచాలని అధికారులకు సూచించారు.
1 replies 3 reposts 20 likes 7.6K views View on X
HMWSSB Verified account @HMWSSBOnline
ఎస్టీపీల పూర్తి సామర్థ్యాన్ని వినియోగించి శుద్ధి చేసిన నీటి సరఫరాను పెంచాలి*
====================
# అదనంగా శుద్ధి జలాలను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్ట
# నిర్మాణ రంగానికి ప్రత్యేక పైప్‌లైన్ల ద్వారా శుద్ధి చేసిన నీటి సరఫరా చేసే అవకాశాలను పరిశీలించాలి
# పటేల్ చెరువు ఎస్టీపీ వద్ద ఎమ్మెల్యేతో కలిసి గ్రీన్ వాటర్ ట్యాంకర్లను ప్రారంభించిన ఎండీ
# నిర్వాణ నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించి శుద్ధి జలాల వినియోగంపై సూచనలు
# నిర్మాణ రంగంలో శుద్ధి చేసిన నీటి వినియోగంతో భూగర్భ జలాలపై ఒత్తిడిని తగ్గించాలి
# గ్రీన్ ట్యాంకర్ ఫిల్లింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాలి

హైదరాబాద్ మహానగరంలో శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని మరింత విస్తరించి, గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సరఫరాను పెంచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నాగోల్, పటేల్ చెరువు మురుగునీటి శుద్ధి కేంద్రాలను (ఎస్టీపీలు) సందర్శించిన ఆయన, శుద్ధి జలాల సరఫరా, గ్రీన్ వాటర్ ట్యాంకర్ల నిర్వహణ, నిర్మాణ రంగంలో శుద్ధి చేసిన నీటి వినియోగంపై అధికారులతో సమీక్షించారు.

నాగోల్ ఎస్టీపీ, గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ పరిశీలన:
మొదటగా నాగోల్ ఎస్టీపీని సందర్శించిన ఎండీ, అక్కడి గ్రీన్ వాటర్ ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించారు. జలమండలి ఎయిర్‌టెక్ యంత్రం నిర్వహణ, శుద్ధి చేసిన నీటి వినియోగంపై ఆపరేటర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి తాగునీరు, చేతులు కడుక్కోవడం, ఇతర వ్యక్తిగత శుభ్రత అవసరాల కోసం వేర్వేరుగా ప్రత్యేక నీటి క్యాన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎస్టీపీలను తక్కువ సామర్థ్యంతో నిర్వహించకుండా, అందుబాటులో ఉన్న శుద్ధి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.

పటేల్ చెరువు వద్ద గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ప్రారంభం:
అనంతరం పటేల్ చెరువు ఎస్టీపీని సందర్శించిన ఎండీ అశోక్ రెడ్డి, అక్కడి శుద్ధి ప్రక్రియతో పాటు గ్రీన్ వాటర్ ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ నిర్వహణను పరిశీలించారు. శుద్ధి జలాల లభ్యత, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే విధానం, నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి గ్రీన్ వాటర్ ట్యాంకర్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రాంతంలో నిర్మాణ కార్యకలాపాలు చేపడుతున్న సంస్థలు గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ది వెర్మాంట్ నిర్వాణ హోమ్‌స్పేసెస్ నిర్మాణ ప్రాంగణం సందర్శన:
పటేల్ చెరువు ఎస్టీపీ ఫిల్లింగ్ స్టేషన్‌లో శుద్ధి చేసిన నీటితో నింపిన గ్రీన్ వాటర్ ట్యాంకర్ నిర్మాణ ప్రాంగణానికి చేరుకుంది. టాంకర్ తో పాటు ఎమ్మెల్యేతో కలిసి అక్కడికి వెళ్లిన ఎండీ అశోక్ రెడ్డి, నిర్మాణ పనుల్లో శుద్ధి జలాల వినియోగంపై సంస్థ యాజమాన్యంతో చర్చించారు.

ఒకే ప్రాంతంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ భవనాల నిర్మాణాలు దీర్ఘకాలంపాటు కొనసాగుతున్నట్లయితే, ట్యాంకర్లపైనే ఆధారపడకుండా ఎస్టీపీ ఫిల్లింగ్ స్టేషన్ నుంచి ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా నేరుగా శుద్ధి జలాలను సరఫరా చేసుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

నిర్మాణ రంగానికి ప్రత్యేక పైప్‌లైన్ వ్యవస్థ:
నగరంలో కనీసం రెండేళ్లపాటు నీటి అవసరాలు ఉండే భారీ నిర్మాణ ప్రాజెక్టులను గుర్తించాలని ఎండీ అధికారులకు సూచించారు. ఆయా ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి సుమారు 300 నుంచి 400 మీటర్ల మేర ప్రత్యేక పైప్‌లైన్లు ఏర్పాటు చేసే సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు.

పైప్‌లైన్ నిర్మాణానికి అయ్యే వ్యయం, సరఫరా సామర్థ్యం, నిర్వహణ అవసరాలతో పాటు భవిష్యత్తులో ఇతర నిర్మాణ ప్రాజెక్టులకు కూడా అదే పైప్‌లైన్‌ను వినియోగించుకునే అవకాశాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు.

శుద్ధి జలాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి:
నిర్మాణ పనుల్లో కాంక్రీట్ క్యూరింగ్, గార్డెనింగ్, ల్యాండ్‌స్కేపింగ్, చెట్ల పెంపకం తదితర అవసరాలకు శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని విస్తరించాలని ఎండీ సూచించారు. ఆయా అవసరాలకు అనుగుణంగా నీటి నాణ్యత ప్రమాణాలను నిర్ధారించి, పరీక్షా నివేదికలు, ధ్రువీకరణ పత్రాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలన్నారు.
గ్రీన్ ట్యాంకర్ ఫిల్లింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాలు:
గ్రీన్ వాటర్ ట్యాంకర్ల నిర్వహణను మరింత పారదర్శకంగా, సమర్థంగా చేపట్టేందుకు ఫిల్లింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఎండీ ఆదేశించారు. ట్యాంకర్ ఫిల్లింగ్ కేంద్రానికి చేరుకోగానే స్కానింగ్ ద్వారా వాహన వివరాలను నమోదు చేసి, అనంతరం నీటిని నింపుకుని వెళ్లే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ట్యాంకర్ల రాకపోకలు, నీటి సరఫరా వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి పర్యవేక్షించాలన్నారు.
HMWSSB Verified account @HMWSSBOnline
నిర్మాణ రంగంలో శుద్ధి చేసిన నీటి వినియోగానికి పెరుగుతున్న ఆదరణ
====================

# గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి జలాల వినియోగానికి ముందుకొస్తున్న నిర్మాణ సంస్థలు

# నవంబర్ 9 నుంచే శుద్ధి జలాల వినియోగానికి శ్రీకారం చుట్టిన వజ్రా వెస్ట్ సిటీ

# నిర్మాణ పనుల్లో క్యూరింగ్, గార్డెనింగ్‌కు రోజుకు 90 వేల నుంచి 1.20 లక్షల లీటర్ల నీటి వినియోగం

# కొకాపేట ఎస్టీపీ నుంచి రోజుకు 3 నుంచి 4 గ్రీన్ వాటర్ ట్యాంకర్ ట్రిప్పులు

# మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తొలి నిర్మాణ సంస్థగా ముందుకొచ్చిన వాసవి గ్రూప్

# తాగునీటి సంరక్షణ, శుద్ధి చేసిన నీటి పునర్వినియోగమే జలమండలి లక్ష్యం

హైదరాబాద్ మహానగరంలో నిర్మాణ రంగంలో శుద్ధి చేసిన నీటి వినియోగానికి ఆదరణ పెరుగుతోంది. తాగునీరు, భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించేందుకు జలమండలి చేపట్టిన గ్రీన్ వాటర్ ట్యాంకర్ల కార్యక్రమానికి నిర్మాణ సంస్థల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. నిర్మాణ పనుల్లో కాంక్రీట్ క్యూరింగ్, గార్డెనింగ్ తదితర తాగేతర అవసరాలకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించేందుకు నిర్మాణ సంస్థలు ముందుకొస్తున్నాయి.

సైబారాబాద్ లో శుద్ధి జలాల వినియోగానికి ముందడుగు వేసిన వజ్రా వెస్ట్ సిటీ:

నిర్మాణ రంగంలో శుద్ధి చేసిన నీటి వినియోగానికి వజ్రా వెస్ట్ సిటీ ముందడుగు వేసింది. నవంబర్ 9వ తేదీ నుంచే గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించడం ప్రారంభించింది. కొకాపేట మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నుంచి రోజుకు 90 నుంచి 120 కిలోలీటర్ల (90 వేల నుంచి 1.20 లక్షల లీటర్ల) నీటిని పొందుతోంది.

30,40 కిలోలీటర్ల సామర్థ్యం గల గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా రోజుకు 3 నుంచి 4 ట్రిప్పుల్లో నీటిని తరలిస్తున్నారు. ఈ నీటిని ప్రధానంగా నిర్మాణ పనుల్లో కాంక్రీట్ క్యూరింగ్‌తో పాటు గార్డెనింగ్ అవసరాలకు వినియోగిస్తున్నారు. తాగునీటికి ప్రత్యామ్నాయంగా శుద్ధి జలాలను వినియోగిస్తూ వజ్రా వెస్ట్ సిటీ ఇతర నిర్మాణ సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోంది.

మల్కాజిగిరిలో తొలి అడుగు వేసిన వాసవి గ్రూప్:

మరోవైపు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలో నిర్మాణ పనులకు ఎస్టీపీ శుద్ధి జలాలను వినియోగించేందుకు వాసవి గ్రూప్ తొలి నిర్మాణ సంస్థగా ముందుకొచ్చింది. వాసవి ఆనంద నిలయం నిర్మాణ ప్రాజెక్టు వద్ద శుక్రవారం శుద్ధి చేసిన నీటి సరఫరాను ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రారంభించారు.

నిర్మాణ రంగంలో తాగునీటికి ప్రత్యామ్నాయంగా శుద్ధి చేసిన నీటిని వినియోగించడం ద్వారా విలువైన తాగునీటి వనరులను సంరక్షించవచ్చని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ఇతర నిర్మాణ సంస్థలు కూడా వాసవి గ్రూప్‌ను ఆదర్శంగా తీసుకుని శుద్ధి జలాల వినియోగానికి ముందుకు రావాలని సూచించారు.

తాగునీటి సంరక్షణకు నిర్మాణ సంస్థలు భాగస్వాములు కావాలి

హైదరాబాద్ మహానగరంలో రాబోయే వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సంరక్షణకు జలమండలి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని నిర్మాణాలు, గార్డెనింగ్, ల్యాండ్‌స్కేపింగ్, ఇతర తాగేతర అవసరాలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

వజ్రా వెస్ట్ సిటీ, వాసవి గ్రూప్ వంటి నిర్మాణ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు రావడం శుభపరిణామమని జలమండలి పేర్కొంది. నగరంలోని ఇతర నిర్మాణ సంస్థలు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

ప్రతి ఒక్కరూ కనీసం 20 శాతం తాగునీటిని ఆదా చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో నిర్మాణ రంగం కీలక భాగస్వామిగా నిలవాలని జలమండలి పిలుపునిస్తోంది.
1 replies 2 reposts 17 likes 4.3K views View on X
HMWSSB Verified account @HMWSSBOnline
ఎంఎంసీలో నిర్మాణ రంగంలోనూ శుద్ధి జలాల వినియోగానికి శ్రీకారం
====================
# ఎంఎంసీ పరిధిలో తొలిసారిగా నిర్మాణ పనులకు ఎస్టీపీ శుద్ధి జలాలు
# గ్రీన్ వాటర్ ట్యాంకర్లను ప్రారంభించిన ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి
# స్వచ్ఛందంగా ముందుకొచ్చిన తొలి నిర్మాణ సంస్థ వాసవి గ్రూప్
# మూడు ఎస్టీపీల నుంచి రోజుకు 56 లక్షల లీటర్ల శుద్ధి జలాలు అందుబాటులోకి
# నిర్మాణ పనులకు తాగునీరు, భూగర్భ జలాలకు బదులుగా శుద్ధి జలాలనే వినియోగించాలి

హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సంరక్షణ, శుద్ధి జలాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించేందుకు జలమండలి చేపట్టిన డయల్-ఎ-గ్రీన్ ట్యాంకర్ కార్యక్రమం నిర్మాణ రంగానికి విస్తరించింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలో తొలిసారిగా నిర్మాణ పనులకు ఎస్టీపీల్లో తృతీయ దశలో శుద్ధి చేసిన నీటిని వినియోగించే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు.

వాసవి ఆనంద నిలయం నిర్మాణ ప్రాంగణంలో ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి గ్రీన్ వాటర్ ట్యాంకర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుద్ధి జలాలను వినియోగించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన తొలి నిర్మాణ సంస్థగా వాసవి గ్రూప్ నిలిచింది.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాబోయే వేసవిలో నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పనులకు తాగునీరు, భూగర్భ జలాలకు బదులుగా టెర్షియరీ శుద్ధి జలాలను వినియోగించాలని సూచించారు. అన్ని నిర్మాణ సంస్థలు ఈ నిబంధనలను పాటించేలా చర్యలు చేపట్టాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ముందుకొచ్చిన వాసవి గ్రూప్‌ను అభినందించారు.

జలమండలి మల్కాజిగిరి రీజియన్ ఈడీ పంకజ మాట్లాడుతూ.. నిర్మాణ ప్రాంగణాల్లో కాంక్రీట్ క్యూరింగ్, దుమ్ము నియంత్రణ, శుభ్రపరిచే పనులకు మాత్రమే శుద్ధి జలాలను వినియోగించాలని సూచించారు. శుద్ధి జలాల వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ఎంఎంసీ ఏసీపీలు, జలమండలి డీజీఎంలతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

మూడు ఎస్టీపీల నుంచి 56 లక్షల లీటర్లు:
ఎంఎంసీ పరిధిలోని సరూర్‌నగర్ (2.50 ఎంఎల్‌డీ), పటేల్ చెరువు (2.50 ఎంఎల్‌డీ), సఫిల్‌గూడ (0.60 ఎంఎల్‌డీ) ఎస్టీపీల నుంచి రోజుకు మొత్తం 5.60 ఎంఎల్‌డీ (56 లక్షల లీటర్లు) టెర్షియరీ శుద్ధి జలాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఈ నీటిని జలమండలి ఉచితంగా అందిస్తుందని, వినియోగదారులు రవాణా ఖర్చులు మాత్రమే భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిర్మాణ సంస్థలు తమ సొంత ట్యాంకర్లను గ్రీన్ వాటర్ ట్యాంకర్లుగా నమోదు చేసుకోవచ్చని, లేదంటే డయల్-ఎ-గ్రీన్ ట్యాంకర్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు 155313 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జలమండలి ఈడీ పంకజ, డైరెక్టర్ బి. నారాయణ, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో, ఎంఎంసీ, జలమండలి అధికారులు, వాసవి గ్రూప్ ప్రతినిధులు పాల్గొన్నారు.