Twitxy Saved

V.C. Sajjanar, IPS

Verified account This account is verified. Learn more

@SajjanarVC_IPS

Proud husband & father | IPS ‘96 | DGP, Telangana | Duty is not a job. It’s a promise. #SayNoToBettingApps
Hyderabad, India whatsapp.com/channel/0029Vb… Joined September 2021
35 Following 190K Followers 17K Posts

Latest posts 5

V.C. Sajjanar, IPS Verified account @SajjanarVC_IPS
An important article in today’s The Hindu by @iAbhinayD sheds light on the silent suffering of boys subjected to sexual abuse. I hope it encourages more parents to speak up, report such abuse and seek justice for their children, helping hold perpetrators accountable and prevent such heinous acts in the future.
This Children’s Day, I write about how shame, fear and social stigma keep sexual assault against minor boys underreported in #Telangana.

🔗 thehindu.com/news/national/…
View quoted post on X
0 replies 8 reposts 45 likes 7.9K views View on X
V.C. Sajjanar, IPS Verified account @SajjanarVC_IPS
బాలల దినోత్సవం అంటే కేవలం వేడుకలే కాదు, పెరుగుతున్న సైబర్, లైంగిక వేధింపుల నుండి చిన్నారుల బాల్యాన్ని కాపాడుకునే బాధ్యతను గుర్తుచేసే సందర్భం.

తల్లిదండ్రులు పిల్లలకు అత్యుత్తమ స్నేహితులుగా మారి సైబర్ భద్రత, బాడీ సేఫ్టీపై అవగాహన కల్పించడంతో పాటు, ఎలాంటి ఆపద ఎదురైనా సంకోచించకుండా పోలీసులను ఆశ్రయించే ధైర్యాన్నివ్వాలి.

మన పిల్లలు డిజిటల్ ఉచ్చులకు బలికాకుండా ప్రతి ఇల్లూ, బడీ ఒక రక్షణ కవచంగా మారాలనే ఆకాంక్షతో రాసిన "మౌనం వీడదాం... బాల్యాన్ని కాపాడుకుందాం!" అనే నా @eenadulivenews ఎడిటోరియల్ ను తప్పక చదవండి.
3 replies 23 reposts 125 likes 5.6K views View on X
V.C. Sajjanar, IPS Verified account @SajjanarVC_IPS
హైదరాబాద్ సీపీగా ఇక సెలవు

గడచిన ఏడాది కాలం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అపురూపమైన ప్రయాణం. చారిత్రక హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సేవ చేసే అవకాశాన్ని కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

అలాగే, హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న శ్రీ మహేష్ భగవత్, ఐపీఎస్ గారికి నా తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు.

ఈ ఏడాది కాలంలో నగర ప్రజలు నాపై, మా పోలీస్ వ్యవస్థపై చూపిన ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. మేము చేపట్టిన ప్రతి సంస్కరణనూ తమ సొంత కార్యక్రమంగా భావించి ఎంతగానో ఆదరించిన ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను.

మత సామరస్యానికి ప్రతీక మన హైదరాబాద్. ప్రజలంతా కలిసిమెలిసి, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి పండుగనూ ఘనంగా జరుపుకున్న తీరు నా మనసును ఎంతగానో కదిలించింది.

ప్రజల క్షేమమే పరమావధిగా మేము అనేక అడుగులు వేశాం. ముఖ్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆహార కల్తీపై ‘హెచ్-ఫాస్ట్’ ద్వారా ఉక్కుపాదం మోపాం. భారీ ఎత్తున కల్తీ ఆహారాన్ని సీజ్ చేసి, నిందితులను కటకటాల వెనక్కి నెట్టే ప్రయత్నంలో మాకు అండగా నిలిచిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు కృతజ్ఞతలు.

మరోవైపు, సైబర్ నేరాల కట్టడి కేవలం పోలీసుల వల్లే కాదని గుర్తించి.. ప్రజల్లో చైతన్యం తెస్తూనే బ్యాంకులు, DoT వంటి విభాగాలను సమన్వయం చేస్తూ దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ ఆక్టోపస్’కు శ్రీకారం చుట్టాం. దీనిపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోం సెక్రటరీ గారు ప్రత్యేకంగా స్పందించి.. మన హైదరాబాద్ సిటీ పోలీస్ ఇచ్చిన సలహాలను స్వీకరించి ప్రశంసించడం మనందరికీ దక్కిన గౌరవం.

అలాగే బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా కేసుల దర్యాప్తు కోసం ‘ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్’ను ప్రారంభించి విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాం.

భావితరాల బిడ్డల్లో పోలీసుల పట్ల భయం పోయి, సమాజం పట్ల ఒక ఉన్నతమైన స్ఫూర్తి కలగాలని ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో చేపట్టిన ‘డే విత్ సీపీ’ కార్యక్రమం నాకు ఎంతో ఆత్మసంతృప్తిని మిగిల్చింది.

ఇక నగరవాసులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఇతర అధికారుల సహకారంతో విజయవంతంగా అమలు చేసి ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం కలిగించాం.

మన ఇంట్లోని ఆడబిడ్డల రక్షణను బాధ్యతగా భావించి మహిళల భద్రత కోసం ‘స్పందన’ వాహనాలను అందుబాటులోకి తెచ్చాం.

ఈ విజయాలన్నింటి వెనుక పోలీస్ కుటుంబం పడిన కష్టం దాగుంది. ఉత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందిని గుర్తించే ‘ఎక్స్‌ట్రా మైల్’, వారి ఆరోగ్య రక్షణ కోసం ‘గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్’ వంటి కార్యక్రమాలు వారి త్యాగాలకు మేమిచ్చిన చిరు కానుకలు.

శాంతిభద్రతలు, ట్రాఫిక్, CAR, టాస్క్‌ఫోర్స్, CCRB, SB, సీపీ ఆఫీస్, అడ్మిన్ విభాగాలు సహా.. పండుగైనా, పబ్బమైనా తమ సొంత కుటుంబాలను పక్కనపెట్టి రోడ్లపై నిలబడి అహర్నిశలు శ్రమించిన హోంగార్డుల నుంచి అడిషనల్ సీపీల వరకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

మాకు నిరంతరం మార్గదర్శనం చేసిన డీజీపీ గారికి, ఇతర ఉన్నతాధికారులకు, ప్రతి క్షణం వెన్నంటి నిలిచిన ప్రింట్-ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు.

రాత్రింబవళ్లు చెమటోడ్చే నా పోలీస్ సిబ్బంది, వారి కుటుంబాలు ఎల్లప్పుడూ క్షేమంగా, ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.

హైదరాబాద్ ప్రజలందరూ సదా సురక్షితంగా, సంతోషంగా, భద్రంగా ఉండాలని ఆకాంక్షిస్తూ.. గుండెనిండా మధుర జ్ఞాపకాలతో.. హైదరాబాద్ సీపీగా ఇక సెలవు తీసుకుంటున్నాను.

జై హింద్!

#ThankYouHyderabad
4:16