Twitxy Saved

YSR Congress Party

Verified account This account is verified. Learn more

@YSRCParty

Yuvajana Sramika Rythu Congress Party is a political party from Andhra Pradesh, founded by @ysjagan
ysrcongress.com Joined February 2011
72 Following 930K Followers 84K Posts

Latest posts 5

Pinned post

YSR Congress Party Verified account @YSRCParty
వైయస్‌ఆర్‌సీపీ తరఫున మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులను, మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీలకు ఛైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు.
YSR Congress Party Verified account @YSRCParty
దివంగత సినీ నటుడు గిరిబాబు గారి కుమారుడు రఘుబాబు గారికి ఫోన్ చేసి పరామర్శించిన వైయస్ జగన్ గారు

అలానే గిరిబాబు గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వైయస్ జగన్ గారు
2 replies 44 reposts 467 likes 5.4K views View on X
YSR Congress Party Verified account @YSRCParty
విజ‌య‌వాడ‌

ఎన్నిక‌ల ప్ర‌క్రియను అప‌హాస్యం చేశారు
- పోలీసు వ్య‌వ‌స్థ‌ను అడ్డం పెట్టుకుని అరాచ‌కాలు
- అధికార కూట‌మి ఆగ‌డాలకు హ‌ద్దులేకుండా పోయింది
: వైఎస్సార్‌సీపీ నాయ‌కుల ధ్వ‌జం

పంచాయ‌తీలు, మున్సిపాలిటీల‌కు నామినేష‌న్ల సంద‌ర్భంగా అధికార కూట‌మి పార్టీలు చేస్తున్న అరాచ‌కాలపై ఎస్ఈసీని క‌లిసి ఫిర్యాదు చేసిన అనంత‌రం మీడియాతో మాట్లాడిన వైఎస్సార్‌సీపీ నాయ‌కులు

- క‌ళ్ల ముందే హింస జ‌రుగుతున్నా ఎస్ఈసీది ప్రేక్ష‌క‌పాత్ర‌
- అక్ర‌మాలు, దౌర్జ‌న్యాల‌పై త‌క్ష‌ణం పార‌ద‌ర్శ‌క విచార‌ణ చేయాలి
- కారకులైన అధికారుల‌ను సస్పెండ్ చేసి ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాలి
: వైఎస్సార్‌సీపీ నాయ‌కుల డిమాండ్

విజ‌య‌వాడ‌:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అపహాస్యం చేస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాయచోటి, శ్రీకాళహస్తి, పల్నాడు, పలమనేరు తదితర ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటూ, మహిళా అభ్యర్థుల పత్రాలను సైతం చింపేస్తున్నారని ఆరోపించారు. విజ‌య‌వాడ‌లో ఎస్ఈసీని క‌లిసి నామినేష‌న్ల సంద‌ర్భంగా కూట‌మి నాయ‌కుల అక్ర‌మాల‌పై ఫిర్యాదు చేసిన అనంత‌రం వైఎస్సార్‌సీపీ నాయ‌కులు మీడియాతో మాట్లాడారు. స్వయంగా మంత్రులే దౌర్జన్యాలకు పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడమే కాకుండా అధికార పార్టీకి అండగా నిలుస్తున్నారని మండిపడ్డారు. దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా బాధితులైన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా స్పందించని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకుని బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు, నామినేషన్లు అడ్డుకున్న ప్రాంతాల్లో పోలీసు భద్రత కల్పించి అభ్యర్థులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందని, ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ క‌ల్ప‌ల‌తారెడ్డి, విజ‌య‌వాడ మాజీ మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, వైఎస్సార్‌సీపీ లీగ‌ల్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు మ‌ల‌సాని మ‌నోహ‌ర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్య‌క్షుడు నారాయ‌ణ మూర్తి, పార్టీ బూత్ కమిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కొండమడుగుల సుధాకర్ రెడ్డి, పార్టీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్ర రెడ్డి, పార్టీ నాగవంశం విభాగం అధ్యక్షుడు బొడ్డు అప్పలనాయుడు, పార్టీ దివ్యాంగుల విభాగం మాజీ అధ్యక్షుడు కిరణ్ రాజ్, పార్టీ బూత్ కమిటీ విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ షేక్ హాసన్ త‌దిత‌రులు ఎస్ఈసీని క‌లిసి ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.

ఎవ‌రెవ‌రు ఏం మాట్లాడారంటే...

కూట‌మి నాయ‌కులు దాడులు చేస్తే, వైఎస్సార్‌సీపీ వారిపై కేసులేంటి?
- మలసాని మనోహర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు

మూడు రోజుల నామినేషన్ గడువులో రెండు రోజులు గడిచిపోయినా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వని దుర్మార్గమైన పరిస్థితి నెలకొంది. రాయచోటి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో స్వయంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి తన అనుచరులతో వెళ్లి నామినేషన్ పత్రాలు చింపించడం, మీడియాపై దాడులు చేయించడం, ఫోన్లు లాక్కోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్‌లను ఉపయోగించి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దాడులు చేస్తున్నది అధికార పార్టీ వారైతే, హత్యాయత్నం కేసులు మాత్రం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పెడుతున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టెంపేడు మండలంలో 17 పంచాయతీల్లో ఒక్క నామినేషన్ కూడా వేయనివ్వని పరిస్థితి ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకుని నిష్పక్షపాతంగా నామినేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలి, లేదంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆందోళనలు చేయక తప్పదు.

దాడుల‌కు బాధ్యులైన వారిని స‌స్పెండ్ చేయాలి
- కల్పలతా రెడ్డి, ఎమ్మెల్సీ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి. అన్నమయ్య జిల్లా, పలమనేరు, పల్నాడు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. అన్నమయ్య జిల్లాలో స్వయంగా మంత్రే మహిళల నామినేషన్ పత్రాలను చింపి, వారిని బయటకు పంపించడం దారుణం. ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. దాడులకు బాధ్యులైన అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలను తక్షణమే సస్పెండ్ చేయాలి. రాయచోటి, శ్రీకాళహస్తి సహా నామినేషన్లు అడ్డుకున్న అన్ని ప్రాంతాల్లో పోలీసు భద్రత కల్పించి అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసేలా చర్యలు తీసుకోవాలి.

మంత్రులే మ‌హిళ‌ల నామినేష‌న్ ప‌త్రాలు చింపేస్తున్నారు
- రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ మాజీ మేయర్

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నంత దుష్టపాలన దేశంలో మరే రాష్ట్రంలోనూ చూసి ఉండము. మంత్రులే నేరుగా వెళ్లి మహిళల నామినేషన్ పత్రాలు లాక్కోవడం, చింపేయడం, వారిని అవమానించి బయటకు నెట్టడం జరుగుతోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం ఏమిటి? పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించడానికి ఉన్నారా, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఉన్నారా? ప్రతిరోజూ ఫిర్యాదులు చేస్తున్నా ఎన్నికల కమిషన్, పోలీసు వ్యవస్థ ఒక్క చర్య కూడా తీసుకోవడం లేదు. రేపు చివరి రోజు కాబట్టి మా అభ్యర్థులందరికీ పోలీసు భద్రత కల్పించి నామినేషన్లు వేయించాలి, లేదంటే 2029 ఎన్నికల్లో ఇంకెంత దారుణమైన పరిస్థితులు సృష్టిస్తారో ప్రజలే ఆలోచించాలి.
1 replies 10 reposts 95 likes 3.2K views View on X
YSR Congress Party Verified account @YSRCParty
ఒకవైపు అభ్యర్థి తలపై దాడి.. మరోవైపు నామినేషన్ పత్రాల చింపివేత.. ఇదేనా ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ?

తల పగలగొట్టడమే కాకుండా, ప్రజాస్వామ్య హక్కుతో దాఖలు చేయాల్సిన నామినేషన్ పత్రాలను సైతం చింపివేత

తొట్టంబేడు మండలం, రౌతుసూరిమాల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నాగరాజు నామినేషన్ దాఖలు చేయడానికి వెళుతున్న తరుణంలో టీడీపీ మూకలు దాడి చేసి తలకాయ పగల కొట్టి నామినేషన్ పత్రాలను చింపేశారు. ఘటన విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు, ఎంపీ మద్దిల గురుమూర్తి గారు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం గారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు

గాయపడిన నాగరాజును మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు తన కారులో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందేలా చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ సీపీ నాయకుల డిమాండ్.

#TDPGoons
#SadistChandraBabu
1:36
1 replies 11 reposts 28 likes 2.3K views View on X
YSR Congress Party Verified account @YSRCParty
రైతాంగాన్ని పీడిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం: కాకాణి గారు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, మనుబోలు మండలం, మడమనూరు గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు

స్థానిక గ్రామస్థులు, రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్న కాకాణి గారు

కూటమి పాలనలో తాము పడుతున్న ఇబ్బందులను కాకాణి గారికి వివరించిన గ్రామస్తులు, రైతులు

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ..

రైతులను, నిరుద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గానికీ మేలు చేయలేని పరిస్థితి నెలకొందని, ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని కాకాణి గారు విమర్శించారు. ఈ వ్యతిరేకతను అధిగమించేందుకు చంద్రబాబు స్థానిక సంస్థలకు సంబంధించి రకరకాల కుట్రలు, కుతంత్రాలకు పాల్పడి, తమదే గెలుపు అన్నట్లుగా ప్రకటించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

గ్రామాలలో పర్యటిస్తుంటే, గత వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలే కనిపిస్తున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చామని, లక్షలాది ఉద్యోగాలు కల్పించామని పదేపదే ప్రచారం చేసుకుంటున్నారని, అయితే గ్రామాల్లో ఒక్క యువకుడు కూడా ఆ పెట్టుబడుల ద్వారా తమకు ఉద్యోగం లేదా ఉపాధి లభించిందని చెప్పే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. పచ్చపత్రికల్లో ప్రచారం చేసుకోవడం మానేసి, వాస్తవంగా ఎన్ని ఉద్యోగాలు కల్పించారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

విశాఖపట్నంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్న చంద్రబాబు, రాష్ట్రంలోని ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారు? ఏ కంపెనీల్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? అనే వివరాలతో జాబితా ప్రకటించాలని సవాల్ విసిరారు. 25 లక్షలు, 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులంటూ ప్రకటనలు చేయడం తప్ప క్షేత్రస్థాయిలో పెట్టుబడులు, ఉద్యోగాలు కనిపించడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో రాష్ట్రానికి రూ.7,200 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చినట్లు ప్రకటించారని పేర్కొన్నారు.చంద్రబాబు ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని కాకాణి గారు విమర్శించారు.

రైతుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం:
గ్రామాల్లో పర్యటిస్తే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణనాతీతమని కాకాణి గారు అన్నారు. యూరియా కొరత నుంచి సాగునీటి సమస్యల వరకు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నెల్లూరు జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల పరిధిలో రైతులకు నీటి యాజమాన్య హక్కులు ఉన్నాయని, ముఖ్యంగా కండలేరు జలాశయం పరివాహక ప్రాంతంలోని మనుబోలు మండల రైతులు తరతరాలుగా కండలేరు నీటిపై ఆధారపడి వరి సాగు చేస్తున్నారని వివరించారు.గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రమోహన్ రెడ్డి నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించేవారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సాగునీటి సమస్యలపై కనీసం నోరు మెదపడం లేదని, విమర్శించారు. నెల్లూరు డెల్టా రైతాంగానికి ఉన్న నీటి హక్కులను కూడా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు వచ్చినప్పుడు వాటిని సోమశిలకు, అక్కడి నుంచి కండలేరు జలాశయానికి తరలించుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఆ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక్క చుక్క నీరు కూడా విడుదల చేయబోమని ప్రకటించిన సమయంలోనే ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం నుంచి సోమశిలకు, అక్కడి నుంచి కండలేరుకు నీటిని తరలించి ఉంటే రైతులకు ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు.మంచి ధాన్యం ధరలు లభిస్తాయని ఆశిస్తున్న సమయంలో సాగునీరు అందించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు.

కనీసం బోరుబావుల కింద సాగు చేసుకుందామన్నా యూరియా ఇవ్వకుండా, ఎరువుల డీలర్లను క్రిమినల్ కేసుల పేరుతో బెదిరించే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు.రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని, ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమా? రైతు వ్యతిరేక ప్రభుత్వమా? అని కాకాణి ప్రశ్నించారు.

రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం విస్మరిస్తోంది.. సాగునీరు, గిట్టుబాటు ధర కల్పించాలి:
రైతుల ప్రయోజనాలను కాపాడటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాకాణి గారు విమర్శించారు. రైతులకు సాగునీరు అందించడంతో పాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తీసుకురావాల్సిన అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని, మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారని కాకాణి గారు ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి నిలిపివేయించానని తెలంగాణ ముఖ్యమంత్రి బహిరంగంగా చెబుతున్నప్పటికీ, ఆ వ్యాఖ్యలపై చంద్రబాబు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదన్నారు. వాస్తవం ఏమిటో చెప్పకుండా రకరకాల వాదనలు తెరపైకి తీసుకొస్తూ ఎదురుదాడికి దిగుతున్నారని విమర్శించారు.

జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించడంతో పాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పించామని కాకాణి గారు తెలిపారు. మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించని సందర్భాల్లో ప్రభుత్వమే పంటలను కొనుగోలు చేసిందన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం రైతుల నుంచి ఒక్క గింజ ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని, కేవలం తప్పుడు లెక్కలు, కట్టుకథలతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు. రైతులకు అవసరమైన సాగునీరు, యూరియా అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. రైతులకు తప్పనిసరిగా గిట్టుబాటు ధర కల్పించాలని, యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ప్రకృతి విపత్తుల కారణంగా పంటలు నష్టపోయినప్పుడు రైతులకు అండగా నిలిచేందుకు గతంలో ఉచిత పంటల బీమా అమలు చేశామని, ప్రస్తుత ప్రభుత్వం కూడా దానిని అమలు చేస్తే రైతులకు ఎంతో ప్రయోజనం కలిగేదన్నారు. రైతుల ప్రయోజనాలు పట్టించుకోకుండా, రైతు వ్యతిరేక విధానాలను కూటమి ప్రభుత్వం అవలంబిస్తుందని మండిపడ్డారు, సోమశిల, కండలేరు జలాశయాల నీటి వినియోగంపై కాకాణి గారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 74 టీఎంసీల నీటిని వినియోగించినప్పటికీ, కేవలం 1.80 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట సాగు జరిగిందన్నారు. సుమారు 18 టీఎంసీల నీటితో సాగు చేయగలిగే పంటలకు అదనంగా 56 టీఎంసీల నీటిని వృథా చేశారని ఆరోపించారు.

శ్రీశైలం జలాశయం నుంచి నెల్లూరు జిల్లాకు నీటిని తరలించే విషయంలో ప్రజాప్రతినిధులు ఎందుకు నోరు విప్పడం లేదని కాకాణి గారు ప్రశ్నించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలంతా అధికార పక్షానికి చెందిన వారే అయినప్పటికీ, చంద్రబాబు వద్దకు వెళ్లి నెల్లూరు రైతులకు సాగునీరు అందించాలని ఎందుకు కోరడం లేదని నిలదీశారు. వ్యవసాయంపై మాటలు చెప్పడం కాకుండా రైతుల పట్ల నిజమైన చిత్తశుద్ధిని ప్రభుత్వం చూపించాలని అన్నారు. వెంటనే ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం ఏర్పాటు చేసి రైతుల సూచనలు, సలహాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించి సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నెల్లూరు జిల్లా రైతాంగానికి, నెల్లూరు డెల్టా ప్రాంతానికి, మనుబోలు ప్రాంతంలో నీటి హక్కులు కలిగిన రైతులకు న్యాయం చేయాలని కాకాణి గారు కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని రైతుల పక్షాన నిలవాలని, లేనిపక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

కాకాణి గారి పర్యటనలో భాగంగా మడమనూరు గ్రామానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుడు విష్ణు గారి మాతృమూర్తి ఇటీవల మృతి చెందడంతో కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.